చెరువులో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతు

చెరువులో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతు

KDP: గాలివీడు మండలంలోని కొమ్మరపల్లి చెరువులో ఆదివారం ఈతకు వెళ్లిన రోహిత్ (14) అనే బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లినట్లు సమాచారం. లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.