పన్నుల వసూలు సరే.. పనులు ఎక్కడ..?

మేడ్చల్: ఉప్పల్ బస్టాండ్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు వెళ్లే మార్గంలో హెచ్ఎండీఏ పీర్జాదిగూడ పార్క్ వద్ద రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు అన్నారు. పలుమార్లు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని, ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం పై ఉన్న శ్రద్ధ పనులు చేయడం పై లేదని ఆగ్రహించారు.