ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి'
MNCL: మంచిర్యాల కాలేజీ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయడంలో భాగంగా రూ.129.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.