'భారీ వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRPT: మునగాల మండల వ్యాప్తంగా నాలుగు రోజులు వర్షాలు ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నందున, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.