ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యాభర్తల స్కెచ్

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యాభర్తల స్కెచ్

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యూపీకి చెందిన భార్యాభర్తలు ఓ కంపెనీని బురిడీ కొట్టించారు. రవిశంకర్ అనే వ్యక్తి 2012లో ఓ బీమా సంస్థలో టర్మ్ పాలసీ తీసుకున్నాడు. అయితే, 2023లో తన భర్త చనిపోయాడని రవిశంకర్ భార్య తప్పుడు పత్రాలు సృష్టించి క్లెయిమ్ దాఖలు చేసింది. దీంతో ఆమెకు బీమా సంస్థ రూ.25 లక్షలు జమ చేసింది. ఆ తర్వాత రవిశంకర్ బతికే ఉన్నాడని తెలియడంతో బీమా కంపెనీ పోలీసులను ఆశ్రయించింది.