'ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు'
KDP: పోరుమామిళ్ల మండలం ఈదులపల్లికు చెందిన లక్కినేని దేవరాజు అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఓ మహిళను శారీరకంగా వాడుకున్నాడని, ఆమె గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం చేయించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై వెల్లడించారు.