CPS విధానాన్ని రద్దు చేయాలి: కొమ్ము కృష్ణ కుమార్

ADB: CPS విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని PRTU TS సంఘం జిల్లాధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం గోడప్రతులను జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.