BJPలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు
నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మంగళవారం బీజేపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంఘం పేట మాజీ సర్పంచ్ మారి విలాస్ 30 మందితో, సీనియర్ నేతలు సరికల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డిలు కూడా చేరారు.