రోడ్డు విస్తరణ పనుల్లో లోపాలు.. వ్యవసాయానికి దెబ్బ

రోడ్డు విస్తరణ పనుల్లో లోపాలు.. వ్యవసాయానికి దెబ్బ

SRPT: నడిగూడెం నుంచి మీనాబాద్ వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు విస్తరణలో నిర్మాణ లోపం బహిర్గతమైంది. సరైన ప్రదేశాల్లో కలవర్టులు నిర్మించకపోవడంతో ఒక్క రాత్రి కురిసిన వర్షానికే వరద రోడ్డుపైకి వచ్చింది. దీంతో రోడ్డు పక్కన వేసిన మట్టిని కొట్టుకుపోయింది. రత్నవరం, రాయలసింగవరం, వసంతాపురం మధ్య ఈ పరిస్థితి ఏర్పడింది. పంట పొలాల్లో మట్టి చేరి రైతులకు నష్టం వాటిల్లింది.