VIDEO: లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం
AKP: పాడేరు ఘాట్‌లో లోడుతో వెళ్తున్న లారీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘాట్‌లోని మలుపు వద్ద లారీ అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని అక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, వాహనం ముందుకు జారిపోకుండా చక్రాల వద్ద రాళ్లు అడ్డుగా పెట్టాడు. ఈ ఘటనతో ఘాట్ రహదారిపై కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి.