రికార్డులు లేని ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

రికార్డులు లేని  ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ASR: వాహనదారులు లైసెన్సు, ఇన్సూరెన్సు ఇతర రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలని జీకేవీధి మండలం సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ సూచించారు. ఆదివారం సీలేరు దుర్గా వీధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సక్రమమైన రికార్డులు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.