గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేత

GNTR: చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ శివాలయం వద్ద ఐదు రోజులుగా ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం రాత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బల ప్రదర్శనలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.