VIDEO: కాట్రియాల తండాలో చిరుత పులి సంచారం

MDK: రామాయంపేట మండలం కాట్రియాల తండా సమీపంలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. ఆదివారం తెల్లవారుజామున తండా సమీపంలోని జత్యకుంట వద్ద చిరుతపులి అడవి దుప్పిపై దాడి చేసి చంపేసింది. ఉదయం వ్యవసాయ పొలాలకు వెళ్తున్న రైతులు చిరుత పులిని చూసి అధికారులకు సమాచారం అందించారు. బీట్ ఆఫీసర్ సాయికృష్ణ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.