నన్ను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు: సర్పంచ్

నన్ను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు: సర్పంచ్

అనంతపురం: టీడీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని చెన్నెకొత్తపల్లి మండలం మేడారం సర్పంచ్ రామాంజనేయులు తెలిపాడు. గ్రామ సచివాలయంలోకి వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. తన పంచాయతీలో పనులు చేయకుండా వారు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకోవాలని అధికారులు సూచనలు ఇస్తున్నారని సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు.