అధికారులపై మార్కాపురం JC ఆగ్రహం
ప్రకాశం: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి అధికారి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.