అనపర్తి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్

అనపర్తి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్

తూ.గో: అనపర్తి ఎంపీడీవోగా వి.వి.రవికుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల బదిలీల్లో భాగంగా విశాఖ జిల్లా కసింకోట ఎంపీడీవోగా పనిచేస్తున్న రవికుమార్ అనపర్తి ఎంపీడీవోగా నియమితులయ్యారు. ఇప్పటివరకు అనపర్తి ఎంపీడీవోగా పనిచేసిన హిమమహేశ్వరి పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీపై వెళ్లారు.