ప్రజాపోరు యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించిన సీపీఎం నేతలు

విశాఖ: ప్రజలు నిత్యవసర సరుకుల ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వాలకు పట్టడం లేదని సీపీఎం మధురవాడ ప్రాంత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి,15 వ తేదీ వరకు ప్రజా పోరు యాత్ర చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందని తెలియచేశారు. ఈ గోడ పత్రికను కొమ్మాది సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు.