జిల్లాలో 657 మంది బైండోవర్: SP

జిల్లాలో 657 మంది బైండోవర్: SP

SRCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 158 కేసులలో 657 మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, చెక్ పోస్టులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు.