VIDEO: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
NRML: సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే దంపతులు మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.