అనుమతులు లేకుండా అకాడమీలు..!

అనుమతులు లేకుండా అకాడమీలు..!

NRPT: నారాయణపేట పట్టణంలో ప్రభుత్వ, విద్యాశాఖ అనుమతులు లేకుండా IIT, NEET అకాడమీ పేరుతో పాఠశాలలు నడుస్తున్నాయని, కనీస సౌకర్యాలు కూడా లేవని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు నాయకుల పలుకుబడితో అకాడమి యజమానులు అధికారుల దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.