రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పట్లు : డీఆర్ఎం
VSP: ఛట్ పూజ సందర్భంగా రైల్వే స్టేషన్లు.. రైళ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ రద్దీ వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక రద్దీ నిర్వహణ చర్యలు అమలు చేసినట్టు డీఆర్ఎం లలిత్ బోహ్రా పేర్కొన్నారు. ఆయన బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.