ప్రేమ పేరుతో మోసం.. పోలీసులను ఆశ్రయించిన కావలి మహిళ
NLR: తనకు సమీప బంధువుగా ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేశారని కావలికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ మొఖం చాటేసాడని న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎస్పీ అజిత వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.