VIDEO: సీఎం ఏ పని చేసినా ఒక మిషన్ ఉంటుంది: హరీష్ రావు
HYD: సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్‌ను ఈ మధ్యే బీఆర్ఎస్ బయట పెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ నిర్మాణం పేరిట రూ. 50 వేల కోట్ల స్కామ్ చేసి, 30% నుంచి 40% వరకు కమిషన్లు దండుకునేందుకు సీఎం సిద్ధమయ్యారన్నారు. ఆయన ఏ పని చేసినా ఒక మిషన్ ఉంటుందని అదే కమీషన్ అని పేర్కొన్నారు.