లోకేశ్ కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులు

లోకేశ్ కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులు

గుంటూరు జిల్లా: తాడేపల్లి పరిధి ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌ను శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేశ్‌కు పోలీసులు తెలుపగా ఆయన సహకరించారు.