ఈనెల 11న మేడిపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
MDCL: మేడిపల్లి బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జనవరి 11న సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలా తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు. ఈ పోటీలు మేడిపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వెనుక గ్రౌండ్‌లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని ఆమె తెలిపారు.