తిరుమలలో 16 వైద్య కేంద్రాలు ఏర్పాటు

తిరుమలలో 16 వైద్య కేంద్రాలు ఏర్పాటు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమలలో 16 వైద్య కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇందులో అశ్విని ఆస్పత్రి ప్రధాన కేంద్రంగా, దీని అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద, ATC సర్కిల్, శ్రీవారి ఆలయం, అలిపిరి నడక మార్గంలోని 1,500వ మెట్లు, గాలి గోపురం వంటి చోట్ల ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 9 అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు.