మంచి మాట: ప్రవర్తన చూసి.. అంచనా వద్దు!
మీతో కఠినంగా వ్యవహరించే వారు మీకు శత్రువులు కాదు. మర్యాదగా ప్రవర్తించే వారు మిత్రులు కాదు. కొంతమంది ప్రవర్తన కఠినంగా ఉన్నా వారు మీకు మార్గదర్శకులుగా ఉండి మీ ఎదుగుదలకు సహకరించేవారు కావచ్చు. మరికొందరు మీతో దయగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. అందుకే ప్రవర్తన బట్టి కాక.. ఉద్దేశాన్ని గమనించి వ్యక్తులను అంచనా వేయండి.