మోదీ నేతృత్వంలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత: కిషన్ రెడ్డి

HYDలోని నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుర్వేదానికి దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగిందని, ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితం నుంచే అనేక వైద్య సమస్యలకు పరిష్కారం చూపిందని ఆయన తెలిపారు. ఆయుర్వేదంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.