ఓబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే
RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓబీసీ విభాగం ఛైర్మన్‌గా బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన ఈరోజు గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓబీసీ వర్గాల అభివృద్ధి కోసం తాను మరింత కృషి చేస్తానని, సామాజిక న్యాయం సాధనలో ముందుండి పని చేస్తానని స్పష్టం చేశారు.