భీమడోలులో వైభవంగా శివకేశవ కళ్యాణం..

పశ్చిమగొదావరి: భీమడోలులో ఒకే వేదిక వద్ద, ఒకే ముహూర్తానికి శివ,కేశవ కళ్యాణం శుక్రవారం రాత్రి జరిగింది. భీమడోలు మండపాల వద్ద కళ్యాణోత్సవాల్లో ముఖ్యఘట్టమైన కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. భీమడోలులో 300ఏళ్ల చరిత్రకలిగిన శ్రీ భీమేశ్వరస్వామి పార్వతీ మరియు శ్రీ వేంకటేశ్వరస్వామి అలివేలు మంగ, లక్ష్మి కళ్యాణం ఒకే చోట ఒకే ముహుర్తానికి శాస్త్రోక్తంగా జరిగింది.