ఓయూ అభివృద్ది కోసం నడుం బిగించిన అధికారులు

HYD: యూనివర్సిటీ అభివృద్ధికి నిధుల కోసం ప్రభుత్వం వైపు చూడకుండా ఉస్మానియా అధికారులు నడుం బిగించారు. ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు. వివిధ కంపెనీలు విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులు ఇస్తున్నాయి. 13 మంది సభ్యులు గల ఈ ఫౌండేషన్ నిధుల సేకరణలో బిజీ బిజీగా ఉంది. కోల్‌కత్తా ఇండియా, సింగరేణి కాలరీస్ తదితర సంస్థలు చేయూత నందిస్తున్నాయి.