SRH vs LSG: పిచ్ రిపోర్ట్

SRH vs LSG: పిచ్ రిపోర్ట్

హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 190+ పరుగులుగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. అయితే, గత సీజన్‌లో ఇక్కడ జరిగిన 5 మ్యాచ్‌ల్లో 4 సార్లు ఛేజింగ్ జట్లే గెలిచాయి. ఇదే స్టేడియంలో SRH 2025లో RRపై 286/3 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.