ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి
GNTR: జిల్లాలోని ప్రత్తిపాడు పరిధిలో గల వెంగాయపాలెం చెరువు వద్ద ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అమృత్ సరోవర్ ప్రాజెక్టు పనులను మంత్రి చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ షేడ్ పథకంలో భాగంగా వెంగళాయపాలెం చెరువును పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.