వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
MBNR: రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సీనియర్ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని దేవరకద్ర శాసనసభ్యులు జీ. మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ నాయకులతో కలిసి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, ఆకాంక్షలను రాజ్యసభలో గలమెత్తి వినిపించాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.