ఇరాన్‌ డిఫెన్స్‌ కౌన్సిల్ కీలక ప్రకటన

ఇరాన్‌ డిఫెన్స్‌ కౌన్సిల్ కీలక ప్రకటన

హర్మూజ్‌లో చమురు రవాణాపై ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తటస్థ దేశాల నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లొచ్చని పేర్కొంది. అయితే, ఇందుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తెలిపింది. మరోవైపు, తమ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని కౌన్సిల్ వెల్లడించింది.