వరాలమ్మ కన్నుమూత.. రాజకీయ ప్రముఖుల సంతాపం
ELR: కామవరపుకోట ఎంపీపీ విజయలక్ష్మి అత్త వరాలమ్మ (85)నిన్న రాత్రి కన్నుమూశారు. ఈమె రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు భార్య కోటగిరి సునీతకు తల్లి. వరాలమ్మ మృతిపై నియోజకవర్గ నేతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.