పోషకాహారంపై అవగాహన
VZM: 8వ పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గంట్యాడ కెజిబివి స్కూల్లో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని కె వి బాలమని ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకి ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.