'లేప్రసీ కేసులను గుర్తించాలి'
PPM: కొమరాడ మండలంలోని మాదిలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కిమిసీల గిరిజన సంక్షేమ పాఠశాలని జిల్లా ఉపవైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో సర్వే జరిపి లేప్రసీ కేసులను గుర్తించాలని పేర్కొన్నారు.