ఉద్యోగులపై దాడి.. ఎమ్మెల్యేపై కేసు

AP: శ్రీశైలం సమీపంలోని శిఖరం చెక్‌పోస్ట్ వద్ద అటవీశాఖ ఉద్యోగి కరీముల్లాపై దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. వాహనంలో దాడి చేసిన తర్వాత అటవీశాఖ ఉద్యోగులను శ్రీశైలంలోని అతిథిగృహంలో బంధించినట్లు సమాచారం. నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ రౌతు అశోక్ ప్రధాన నిందితుడిగా (ఏ1) తేల్చారు. MLAను ఏ2గా చేర్చారు.