మిలాన్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
VSP: విశాఖలోని బుధవారం నుంచి ఈనెల 25 వరకు జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, సిటీ పరేడ్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి 150 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు ఈ సర్వీసులు నడుస్తాయన్నారు.