ఈ చెరువుతో 8 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం

ఈ చెరువుతో 8 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం

సత్యసాయి: రాయలసీమలోనే అతిపెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువు (8,200 ఎకరాల ఆయకట్టు)లోకి CM చంద్రబాబు నాయుడు చొరవతో హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణమ్మ నీరు చేరింది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ చెరువుకు కర్ణాటకలోని పరగోడు రిజర్వాయర్ కారణంగా నీరు ఆగిపోయింది. ఇప్పుడు కృష్ణమ్మ జలాలతో 8 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతోంది.