జిల్లా వైసీపీ అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశం

జిల్లా వైసీపీ అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశం

అనంతపురం, సత్యసాయి జిల్లాల అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్‌లకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పార్టీ ఓనర్‌షిప్‌ మీదే అని స్పష్టం చేశారు. ప్రజా సంబంధిత అంశాల్లో చొరవ చూపాలని సూచించారు. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దని, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలని అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు.