బెంగాల్ ఆత్మలో గంగ ప్రవహిస్తోంది: ప్రధాని మోదీ

బెంగాల్ ఆత్మలో గంగ ప్రవహిస్తోంది: ప్రధాని మోదీ

ప్రతి బెంగాలీ హృదయంలో గంగానదికి ప్రత్యేక స్థానం ఉందని, వారి ఆత్మలో గంగ ప్రవహిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోల్‌కతా హుగ్లీ నది ఒడ్డున సమయం గడపడం, గంగామాతకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం దక్కిందని 'X'లో పంచుకున్నారు. గంగానది నాగరికత యొక్క కాలాతీత స్ఫూర్తిని, దైవికతను తీసుకెళ్తుందని అభివర్ణించారు. కోల్‌కతాలో ఆయన బోట్ మెన్లతో, వాకింగ్ చేసేవారితో ముచ్చటించారు.