మంత్రాలయం నదిలోకి భక్తులకు నో ఎంట్రీ..

మంత్రాలయం నదిలోకి భక్తులకు నో ఎంట్రీ..

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వెనుక భాగంలో ఉన్న తుంగభద్ర నది ప్రవాహాన్ని MRO రమాదేవి పరిశీలించారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,20000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నది ఉదృతంగా ప్రవహిస్తోందని, దీంతో నదిలోకి భక్తులను అనుమతించరాదని, మఠం షవర్ల ద్వారానే స్నానం చేయాలని ఆదేశించారు. గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.