అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
KDP: అప్పుల బాధతో ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన కౌలు రైతు వెంకట నరసారెడ్డి (60) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలు విఫలమవడంతో రూ.40 లక్షల అప్పుల బారిన పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.