రేపు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు

HYD: ఉప్పల్ స్టేడియంలో సోమవారం సన్‌రైజర్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:50 వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు. రామాంతపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వెహికిల్స్ స్ట్రీట్ నంబర్ 8 మీదుగా ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. ఉప్పల్ వచ్చే వాహనాలను HMDA భగాయత్ రోడ్డు మీదుగా నాగోల్ వైపు మళ్లించనున్నారు.