నేడు ముమ్మిడివరంలో విద్యుత్ అంతరాయం
కోనసీమ: ముమ్మిడివరం మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ ఈఈ కె. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు గమనించాలని సూచించారు.