గంజాయి మత్తులో వ్యక్తి దారుణ హత్య

MDCL: కేపీహెచ్బీ పీఎస్ పరిధిలోని సర్దార్ పటేల్‌నగర్‌లో గంజాయిమత్తులో పవన్ గ్యాంగ్ హత్యకు పాల్పడింది. ఓ పార్కులో గంజాయి సేవిస్తూ గొడవ చేస్తున్న ఐదుగురిని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వెంకటరమణ నిలదీశారు. దీంతో పవన్ ఇనుపకడ్డీతో వెంకటరమణ గుండెలో పొడిచి హత్య చేశాడు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, పవన్ పరారీలో ఉన్నాడు.