వేడి నీటిలో పడిన చిన్నారి..

వేడి నీటిలో పడిన చిన్నారి..

GDWL: గద్వాల మండలం పరుమాల గ్రామానికి చెందిన జమ్మన్న కుమార్తె గురువారం ప్రమాదవశాత్తు వేడి నీళ్ల హీటర్‌లో పడి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి చర్మం పూర్తిగా కాలిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారింది. దీంతో డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.