మరణిస్తూ.. ఆరుగురి ప్రాణాలు నిలబెట్టాడు

TG: తాను మరణిస్తూ ఓ యువకుడు ఆరుగురి ప్రాణాలు నిలబెట్టాడు. వరంగల్(D) వర్ధన్నపేటకు చెందిన రమణ(25).. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయాడు. రమణ అవయవదానానికి అతని కుటుంబం ముందుకొచ్చింది. దీంతో అతని కళ్లు, కిడ్నీలు, గుండెను సేకరించి ఆరుగురికి ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ తెలంగాణ వెల్లడించింది. దీన్ని RTC MD సజ్జనార్ షేర్ చేస్తూ.. రమణ కుటుంబ సభ్యులకు సెల్యూట్ చెప్పారు.